News February 25, 2025
కామారెడ్డి: వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పండగ సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోష్నా సోమవారం తెలిపారు. 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ నుంచి వేములవాడకు పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.150 టికెట్ ధరతో.. ఆర్మూర్ నుంచి రూ.220 పెద్దలకు, రూ.120 పిల్లలకు, కామారెడ్డి నుంచి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.80 టికెట్ ధర ఉంటుందన్నారు.
Similar News
News October 16, 2025
రబీలో కుసుమ సాగుకు అనువైన రకాలు

రబీలో సాగుకు అనువైన నూనెగింజ పంటల్లో కుసుమ ఒకటి. ఇది ఔషధ మొక్కగా, నూనెగింజ పంటగా విశిష్ఠ ప్రాధాన్యత కలిగి ఉంది. చల్లని వాతావరణంలో ఇది అధిక దిగుబడినిస్తుంది. అక్టోబరు చివరి వరకు ఈ పంటను నాటుకోవచ్చు. టి.ఎస్.ఎఫ్-1, నారీ-6, నారీ ఎన్.హెచ్-1, పి.బి.ఎన్.ఎస్-12, D.S.H-185, ఎస్.ఎస్.ఎఫ్-708 వంటి రకాలు అధిక దిగుబడిని అందిస్తాయి. నారీ-6 రకం ముళ్లు లేనిది. ఎకరాకు 7.5kgల నుంచి 10kgల విత్తనం సరిపోతుంది.
News October 16, 2025
జూబ్లీహిల్స్ బై పోల్.. ROAD TO జీహెచ్ఎంసీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గ్రేటర్ ఎన్నికలకు బాటవేయనున్నాయి. అందుకే కాంగ్రెస్ సహా బీఆర్ఎస్, బీజేపీలు జూబ్లీహిల్స్ బై పోల్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలిచి గ్రేటర్‌ను హస్తగతం చేసుకోవాలని అధికార పార్టీ.. ఎలాగైనా విజయం సాధించి గ్రేటర్‌పై పట్టుపోలేదని నిరూపించాలని బీఆర్ఎస్.. అప్పుడు 48 డివిజన్లు గెలిచాం.. జూబ్లిహిల్స్‌లో కాషాయజెండా ఎగురవేసి గ్రేటర్ పీఠం ఎక్కాలని బీజేపీ భావిస్తున్నాయి.
News October 16, 2025
స్థిరంగా బంగారం ధరలు!

భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు ఇవాళ బ్రేక్ పడింది. మార్కెట్లకు సెలవు లేకపోయినా ధన త్రయోదశి ముందు బంగారం ధరలు స్థిరంగా ఉండటం గమనార్హం. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,440 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,18,650గా ఉంది. అటు వెండి ధర రూ.1,000 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,06,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.