News April 3, 2025
కామారెడ్డి: శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: DEO

ఇటీవల ప్రమోషన్ పొందిన GHM, PSHM, SAలకు నిజామాబాద్లో శిక్షణ ఉంటుందని DEO రాజు తెలిపారు. ఈ నెల 3న SA (తెలుగు), 4న SA(హిందీ) టీచర్లకు కామారెడ్డి ZPHS బాయ్స్, కృష్ణాజివాడి ZPHSలో శిక్షణ ఉంటుందన్నారు. అలాగే SA (ఉర్దూ) మీడియం టీచర్లకు హైదరాబాద్ TGIRDలో మిగతా ఉర్దూ మీడియం సబ్జెక్ట్స్ టీచర్లకు నిజామాబాద్లో శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని DEO సూచించారు.
Similar News
News April 11, 2025
వేసవిలో వాకింగ్.. ఎప్పుడు చేయాలంటే..

వాకింగ్ అలవాటున్నవారికి వేసవిలో వేడిమి సమస్యగా ఉంటుంది. వారు ఆలస్యంగా లేచి వాకింగ్ చేయడం మంచిదికాదని జీవనశైలి నిపుణులు పేర్కొంటున్నారు. ‘సమ్మర్లో ఉదయం 7.30 గంటల్లోపు వాకింగ్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత సూర్యుడి తీవ్రత పెరుగుతుంటుంది. అది ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఉదయం 10 గంటలు దాటాక, సాయంత్రం 5 గంటలలోపు ఆరుబయట వ్యాయామం, వాకింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు’ అని సూచిస్తున్నారు.
News April 11, 2025
వరంగల్ మార్కెట్కు మూడు రోజుల సెలవులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.
News April 11, 2025
నేడే జాబ్ మేళా.. సద్వినియోగం చేసుకోండి: మంత్రి కొండా

వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు టాస్క్ వారి సౌజన్యంతో నేడు జాబ్ మేళా జరగనుంది. వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. శుక్రవారం ఉదయం 9:30 నుంచి వరంగల్లోని ఎంకే నాయుడు హోటల్స్, కన్వెన్షన్లో ప్రారంభం అవుతుందని మంత్రి గుర్తు చేశారు.