News February 25, 2025
కామారెడ్డి: శీనన్న కష్టపడి పని చేయండి: CM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నిజామాబాద్కు సీఎంను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీపై ఎంతైనా ఉందని చెప్పారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారన్నారని తెలిపారు.
Similar News
News December 8, 2025
ముడతలు తగ్గించే ఫేస్ ప్యాక్

యవ్వనంగా కనిపించే చర్మం కోసం రసాయన ఉత్పత్తులకు బదులు ఇంట్లోని సహజ పదార్థాలను వాడితే చాలు. వాటిల్లో ఒకటే ఈ అరటిపండు ఫేస్ ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును తీసుకొని కాస్త తేనె, బార్లీ పౌడర్ కలిపి పేస్ట్ చేయాలి. బార్లీకి బదులు బియ్యప్పిండి కూడా వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అరగంట ఉంచిన తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేస్తే చర్మం యవ్వనంగా మారుతుంది.
News December 8, 2025
సిద్దిపేట జిల్లాలో 10 నుంచి జాగ్రత్త

సిద్దిపేట జిల్లాలో డిసెంబర్ 10 నుంచి 13 వరకు రాబోయే 7 రోజుల్లో శక్తివంతమైన శీతల గాలలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పింక్ మార్కు ఉన్న జిల్లాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు 6-9°C వరకు తగ్గనున్నాయి. అదేవిధంగా నీలం మార్క్ ఉన్న జిల్లాల్లో 9-12°C వరకు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
News December 8, 2025
శివలింగానికి అభిషేకం చేస్తున్నారా?

శివుడు అభిషేక ప్రియుడు. అయనను నీటితో అభిషేకించినా అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే ఉత్తర/తూర్పు దిశలో నిలబడి రాగి/కంచు పాత్రతో శివాభిషేకం చేయడం అత్యంత శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. అభిషేక సమయంలో ‘‘ఓం నమః శివాయ’’ అనే పంచాక్షరీ మంత్రం లేదా ‘‘ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్ర ప్రచోదయాత్’’ అనే గాయత్రీ మంత్రాన్ని పఠించాలని సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


