News May 20, 2024
కామారెడ్డి: శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వరంగల్ నగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి గుజ్జుల మహేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Similar News
News December 13, 2024
కేంద్ర మంత్రులను కలిసిన ఎంపీ సురేష్ శెట్కార్
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి వెళ్లిన సీఎం రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, సింగరేణి బొగ్గు గనులు, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై వారితో సీఎం చర్చించారు. కలిసిన వారిలో జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ ఉన్నారు.
News December 12, 2024
NZB: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా నిర్వహిస్తున్న మొబైల్ యాప్ సర్వేను నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి, పెర్కిట్ గ్రామాల్లో సర్వేను పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
News December 12, 2024
మెండోరా: ఏడాదిగా మూసి ఉన్న ATM
మెండోరా మండలం పోచంపాడ్ చౌరస్తాలోని SBI ATM ఏడాదిగా మూసిఉంది. 2023 SEPలో దొంగలు ATMలో చోరీ చేసి రూ.12లక్షలు ఎత్తుకెళ్లడంతో అప్పటినుంచి అది మూతపడి ఉంది. మండలం చుట్టుపక్కల ATMలు లేకపోవడంతో నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిర్మల్ లేదా బాల్కొండ వెళ్లాల్సి వస్తోందని, అధికారులు స్పందించి దాన్ని ఓపెన్ చేయాలని కోరారు.