News February 11, 2025
కామారెడ్డి: సహకార శాఖ జూ.ఇన్స్పెక్టర్ మృతి

కామారెడ్డి కలెక్టరేట్లోని జిల్లా సహకార కార్యాలయంలో జూ.ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించే రంజిత్ కుమార్(30) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. వారం రోజుల క్రితం రంజిత్ కుమార్‌కి మెదడులో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు వెల్లడించారు.
Similar News
News November 23, 2025
ఖమ్మం: టెక్నికల్ కోర్సు పరీక్ష ఫీజు గడువు డిసెంబర్ 5

2026 విద్యా సంవత్సరంలో నిర్వహించే టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ) పరీక్షల ఫీజును డిసెంబర్ 5వ తేదీలోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్యజైని శనివారం తెలిపారు. పరీక్ష రుసుము రూ.100గా నిర్ణయించారు. అపరాధ రుసుముతో గడువును పెంచారు. రూ. 50 అపరాధ రుసుముతో డిసెంబర్ 12 వరకు, రూ.75 అపరాధ రుసుముతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చని ఆమె వివరించారు.
News November 23, 2025
సింగరేణి ట్రేడ్ మెన్ వారసుడే భూపాలపల్లి ఎస్పీ

సింగరేణి కంపెనీలో బెల్లంపల్లి సివిల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న సిరిశెట్టి సత్యనారాయణ కుమారుడు సంకీర్త్ భూపాలపల్లి నూతన ఎస్పీగా నియమితులయ్యారు. అంతకుముందు మిషన్ భగీరథ ఇంజనీర్‌గా పని చేసిన సంకీర్త్, తన ప్రతిభతో సివిల్స్‌లో 330వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. భూపాలపల్లి ఎస్పీగా రావడంతో సింగరేణి ఏరియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
News November 23, 2025
ప.గో: బొలెరో ఢీకొని యువకుడి మృతి

నరసాపురం హైవేపై జరిగిన ప్రమాదంలో మొగల్తూరుకు చెందిన మన్నే ఫణీంద్ర (21) దుర్మరణం పాలయ్యారు. శనివారం పాలకొల్లు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బొలెరో ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఫణీంద్రను మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలిస్తుండగా దారిలో మృతి చెందారు. మృతుడి సోదరుడు వాసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు.


