News April 9, 2025
కామారెడ్డి: సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణపై కమిటీ నిర్ణయం: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణకు జిల్లా సహకార అభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జిల్లాలో 10 కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని తీర్మానించామని, ప్రతిపాదనలు రాష్ట్ర స్థాయి కమిటీకి పంపిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఇతర శాఖాధికారులు ఉన్నారు.
Similar News
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>
News December 13, 2025
సూర్యాపేట: రెండో విడతలో 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

సూర్యాపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 8మండలాల్లో జరగనున్నాయి. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 2 మండలాలు, కోదాడ నియోజకవర్గానికి చెందిన 6మండలాలు ఉన్నాయి. మొత్తం 181గ్రామ పంచాయతీలకు గాను 23గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 1,628వార్డులు ఉండగా, అందులో 339 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన గ్రామ పంచాయతీలు, వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది.


