News April 12, 2025
కామారెడ్డి: ‘సిటీ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేయాలి’

కామారెడ్డిలో గల 250 పడకల ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మంత్రి దమోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు హైదరాబాదులో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ యంత్రం లేకపోవడంతో పేద రోగులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Similar News
News April 18, 2026
నేర నియంత్రణే లక్ష్యం: జిల్లా ఎస్పీ

పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఎస్పీ సతీశ్ కుమార్ శనివారం జిల్లాస్థాయి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులు విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. సమాజానికి హాని కలిగించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని స్పష్టం చేశారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను అభినందించారు.
News April 18, 2026
హైదరాబాద్.. అడుగడుగునా ‘షాందార్’

శిలలపై చెక్కిన కావ్యంలా హైదరాబాద్ అడుగడుగునా ‘షాందార్’ అనిపిస్తుంది. చార్మినార్ దర్పం, గోల్కొండ కోట శబ్ద విన్యాసాలు, కుతుబ్ షాహీ సమాధుల కళా వైభవం నగరానికి మణిహారాలు. నిజాంల విలాసానికి ప్రతీక చౌమహల్లా ప్యాలెస్. బన్సీలాల్‌పేట్ మెట్ల బావి కూడా గొప్ప వారసత్వం, సంస్కృతికి సాక్ష్యాలు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. గోల్కొండ, చార్మినార్ గోడలపై పిచ్చి రాతలు వద్దు. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం.
News April 18, 2026
హైదరాబాద్.. అడుగడుగునా ‘షాందార్’

శిలలపై చెక్కిన కావ్యంలా HYD అడుగడుగునా ‘షాందార్’ అనిపిస్తుంది. చార్మినార్ దర్పం, గోల్కొండ కోట శబ్ద విన్యాసాలు, కుతుబ్ షాహీ సమాధుల కళా వైభవం నగరానికి మణిహారాలు. నిజాంల విలాసానికి ప్రతీక చౌమహల్లా ప్యాలెస్. బన్సీలాల్‌పేట్ మెట్ల బావి, సాలార్జంగ్ మ్యూజియం గొప్ప వారసత్వం, సంస్కృతికి సాక్ష్యాలు. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. చరిత్ర గుర్తులపై పిచ్చి రాతలు వద్దు. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం.


