News September 25, 2024

కామారెడ్డి: సీఎంఆర్ బియ్యం సరఫరా త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

సీఎంఆర్ బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రాజంపేటలోని శంకధార రైస్ మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైసుమిల్లుకు కేటాయించిన వరి ధాన్యాన్ని తొందరగా సరఫరా చేయాలని అన్నారు. రైస్ మిల్లులో వరి ధాన్యం బస్తాలను లెక్కించే విధంగా పెట్టాలని అన్నారు.

Similar News

News February 28, 2026

NZB: గోడౌన్‌లు సిద్ధం చేయాలి

image

ప్రస్తుత సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించే వరి ధాన్యాన్ని నిలువ చేసేందుకు వీలుగా గోడౌన్‌లను సిద్ధం చేయాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం, ఎఫ్సీఐకి ఎంత పరిమాణంలో బియ్యం నిల్వలు అందించారు అని ఆరా తీశారు.

News February 28, 2026

ఎడపల్లి: క్రీడలు జీవితంలో ఎంతో ముఖ్యం: జిల్లా జడ్జి

image

క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని NZB జిల్లా జడ్జి భరత లక్ష్మీ అన్నారు. సీపీ XI టీం వర్సెస్ జ్యూడిషియల్ XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో జ్యూడిషియల్ టీం విజయం సాధించింది. జడ్జి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. పోలీస్ శాఖ, న్యాయ విభాగం సభ్యులు నిత్యం ఎంతో బిజీగా విధుల్లో ఉంటూ తమ సమయం కేటాయించి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.

News February 28, 2026

NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం: కలెక్టర్

image

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా పంపిణీ చేపట్టగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలని హితవు పలికారు.