News July 16, 2024
కామారెడ్డి: సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే క్రైస్తవ, మైనార్టీల విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి టి.దయానంద్ ఒక ప్రకటనలో కోరారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో 2024 గాను PG, PHD చేయాలనుకునేవారు స్కాలర్షిప్ మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. వివరాలకు కలెక్టరేట్‌లోని రూమ్ నం.222లో సంప్రదించాలన్నారు.
Similar News
News October 13, 2024
కామారెడ్డి: తండ్రి మృతదేహం లభ్యం
తాడ్వాయి మండలం నందివాడలోని ఓ బావిలో చిన్నారులు విఘ్నేశ్ (7), అనిరుధ్(5 ) <<14345635>>మృతదేహాలు లభ్యమైన<<>> సంగతి తెలిసిందే. పోలీసులు, అధికారులు గాలింపు చేపట్టగా తండ్రి శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. తండ్రితో పాటు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2024
NZB: డీఎస్సీ ఫలితాల్లో మెరిసిన తెలంగాణ వర్సిటీ విద్యార్థులు
ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం 8 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా అందులో 6 గురు SGT, ఇద్దరు SA కొలువులు సాధించారు.ఉద్యోగాలు సాధించిన వారిలో గణపురం సుశీల(SGT), సదాలి నరేష్(SGT), గైని రాజు(SGT), అన్నాడి అజయ్ కుమార్(SGT), M.శ్రీశైలం(SGT), మొహ్మద్ ఖాజా(SGT), నంద అనిల్ (SA సోషల్), దేవసోత్ చందర్ రాథోడ్(SAసోషల్) ఉన్నారు.
News October 12, 2024
NZB: దసరా వేడుకల్లో దిల్ రాజు, సినీ హీరో ఆశిష్
NZB జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల గోవిందవనమాల క్షేత్రంలో శనివారం రాత్రి జరిగిన దసరా వేడుకల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినీ హీరో ఆశిష్ పాల్గొన్నారు. వేద పండితుల మధ్యన శమి వృక్షానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని పల్లకీ మోశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి, విజయ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.