News February 3, 2025
కామారెడ్డి: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్ విద్యార్థులు 15,267 మంది, ఒకేషనల్ కోర్సు విద్యార్థులు 3,979 మంది ప్రాక్టికల్స్ కు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.
Similar News
News September 18, 2025
సీఎంతో డీఎస్సీ అభ్యర్థుల సమావేశం వాయిదా: డీఈవో

వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో శుక్రవారం అమరావతిలో జరగాల్సిన డీఎస్సీ ఉపాధ్యాయుల సమావేశం వాయిదా పడినట్లు డీఈఓ షేక్ సలీం బాషా తెలిపారు. జిల్లా కలెక్టర్ నుంచి ఈ సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓలు డీఎస్సీ అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. తదుపరి సమావేశం తేదీని ఇంకా నిర్ణయించలేదని, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 18, 2025
నెల్లూరు: గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన నెల్లూరు-వేదాయపాలెం రైల్వే స్టేషన్ మధ్య బుధవారం జరిగింది. విజయవాడ-చెన్నై మార్గంలో రైలు పట్టాలపై డెడ్ బాడీ దొరికింది. డోర్ వద్ద కూర్చొని రైలు నుంచి జారిపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుంది. మెరూన్ రంగు ఆఫ్ టీషర్ట్, బ్లూ రంగు షార్ట్ ధరించాడు. ఎస్సై హరి చందన కేసు నమోదు చేశారు.
News September 18, 2025
వరంగల్ మార్కెట్లో స్థిరంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్థిరంగా ఉంది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7440 ధర పలకగా.. ఈరోజు సైతం అదే ధర పలికింది. కాగా, సోమవారం రూ.7,400 ధర పలకగా.. మంగళవారం రూ.7,480 అయింది. మార్కెట్లో కొనుగోలు-అమ్మకాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.