News February 3, 2025

కామారెడ్డి: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు

image

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్ విద్యార్థులు 15,267 మంది, ఒకేషనల్ కోర్సు విద్యార్థులు 3,979 మంది ప్రాక్టికల్స్ కు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి.

Similar News

News February 18, 2025

పెద్దపల్లి: ‘మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలి’

image

నిర్దేశిత పనులను మండలాల్లో ప్రతి అధికారి సమర్థంగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ తర్వాత జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్.సీ.డీ సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

News February 18, 2025

బయట ఫుడ్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారా?

image

రెస్టారెంట్‌ ఫుడ్ తినడంలో చైనా, అమెరికా, సింగపూర్ దేశాలు ముందున్నాయి. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దీనికి డా.సుధీర్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. ‘ఇందులో మేము సింగపూర్ & ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే వెనుకబడి ఉన్నా పర్లేదు. ఎందుకంటే ఇంట్లో వండిన ఆహారం అత్యంత ఆరోగ్యకరమైన ఎంపిక. బయట ఫుడ్ వల్ల ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తవచ్చు’ అని తెలిపారు.

News February 18, 2025

చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోంది: YCP

image

AP: వల్లభనేని వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోందని వైసీపీ ఆరోపించింది. గన్నవరం కేసులో అన్నీ కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలేనని.. కోర్టు లో సత్యవర్ధన్ స్టేట్‌మెంటే ఇందుకు నిదర్శనమని తెలిపింది. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, ఎవరూ బలవంతం పెట్టలేదని ఆయన చెప్పారని పేర్కొంది.

error: Content is protected !!