News February 2, 2025
కామారెడ్డి: సూపర్ మార్కెట్ దొంగలు అరెస్టు

కామారెడ్డి పట్టణంలో గత వారం ఓ సూపర్ మార్కెట్లో దొంగతనం కేసులో లంబాడి రాజు, బుట్టరాజు, మెదక్ జిల్లా టేక్మల్కు చెందిన ఇద్దరు పాత నేరస్థులను శనివారం పట్టుకున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వీరంతా పాత నేరస్థులని.. గతంలో వీరిపై మెదక్, నర్సాపూర్ సంగారెడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు.
Similar News
News November 4, 2025
అధిష్ఠానం ఇచ్చిన సమాచారంతోనే మాట్లాడా: శ్యామల

కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం కేసులో వైసీపీ నాయకురాలు శ్యామల సోమవారం డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 2 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. శివశంకర్ బెల్టు షాపులో మద్యం తాగి ప్రమాదం చేశారన్న ఆరోపణలపై ఆధారాలు అడగ్గా అధిష్ఠానం ఇచ్చిన సమాచారం మేరకే మాట్లాడానని చెప్పినట్లు తెలిసింది. విచారణ అనంతరం ఎన్ని కేసులు పెట్టినా, విచారణల పేరుతో ఎన్నిసార్లు తిప్పినా పోరాటం ఆపనని శ్యామల చెప్పారు.
News November 4, 2025
కరీంనగర్: SU B.com, Bsc పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో జరుగనున్న బి.కాం (బి.ఎస్.ఎఫ్.ఐ) ఈ-కామర్స్, బీ.ఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విభాగంలో 1వ సెమిస్టర్ పరీక్షల <<18189571>>ఫీజు<<>> నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా NOV 07 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో NOV 10 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ లో చూడాలని సూచించారు.
News November 4, 2025
హనుమకొండ: భూ కబ్జాకు యత్నం.. ఇద్దరి అరెస్టు

HNK జిల్లా కాకతీయ యూనివర్సిటీ శివారులో భూకబ్జా యత్నం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుండ్లసింగారం సర్వే నంబర్ 1/1లో తన భూమిని మహ్మద్ ఇబ్రహీం, లింగంపల్లి నేతాజీలు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని బాధితుడు బిత్తిని వేణుగోపాలరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. విచారణలో నిందితుల ప్రమేయం తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపినట్లు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు తెలిపారు.


