News February 2, 2025
కామారెడ్డి: సూపర్ మార్కెట్ దొంగలు అరెస్టు

కామారెడ్డి పట్టణంలో గత వారం ఓ సూపర్ మార్కెట్‌లో దొంగతనం కేసులో లంబాడి రాజు, బుట్టరాజు, మెదక్ జిల్లా టేక్మల్‌కు చెందిన ఇద్దరు పాత నేరస్థులను శనివారం పట్టుకున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వీరంతా పాత నేరస్థులని.. గతంలో వీరిపై మెదక్, నర్సాపూర్ సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు.
Similar News
News February 18, 2025
ముస్లిం ఉద్యోగులకే పండుగా.. హిందువుల సంగతేంటి?: రాజాసింగ్

TG: రంజాన్ మాసంలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు గంట ముందే కార్యాలయాల నుంచి వెళ్లిపోయేందుకు వెసులుబాటు కల్పించడంపై బీజేపీ MLA రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. బుజ్జగింపు రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయని ట్వీట్ చేశారు. ‘ఉద్యోగులు త్వరగా ఇళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ హిందువుల పండుగలను విస్మరించింది. అందరికీ ఒకే రకమైన హక్కులు ఉండాలి. లేదంటే ఎవరికీ ఉండకూడదు’ అని పేర్కొన్నారు.
News February 18, 2025
వైఎస్ జగన్ దళిత ద్రోహి: ఎమ్మెల్యే బండారు శ్రావణి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దళిత ద్రోహి అని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి విమర్శించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. దళితులపై దాడి కేసులో విజయవాడ సబ్ జైల్‌లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు’ అని చెప్పే నాయకుడు ఎస్సీల పైన దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారని మండిపడ్డారు.
News February 18, 2025
సంగారెడ్డి: సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

నిధులు దుర్వినియోగం చేసినందుకు కంది మండలం తూనికల తండా పంచాయతీ కార్యదర్శి రేఖను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదాశివపేట మండలం వెల్టూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో రూ.4 లక్షలు దుర్వినియోగమైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పుస్తకాల నిర్వహణలో కూడా నిర్లక్ష్యం వహించినట్లు తెలిపారు.