News February 26, 2026

కామారెడ్డి: స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

హకీంపేట్ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి NZB జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. 20 సీట్లు (10 బాలురు, 10 బాలికలు) అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు https://tgss.telangana.gov.in/ ద్వారా FEB 26 నుంచి MAR 4 వరకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News April 18, 2026

KNR: వాహనదారులకు ‘రిజిస్ట్రేషన్‌’ కష్టాలు..!

image

వాహన్ పోర్టల్ అమలుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభమైందని చెప్పినా, RCలు సకాలంలో అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షోరూంల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయి 2 నెలలు గడిచినా RCలు అందకపోవడం గమనార్హం. TR గడువు ముగిసినా RC లేక వాహనదారులు రోడ్లపైకి వెళ్లలేకపోతున్నారు. RTO కార్యాలయాల్లో అడిగితే సాంకేతిక కారణాలంటూ పంపిస్తున్నారని బాధితులు చెబుతుండగా ఈ సమస్య కరీంనగర్, పెద్దపల్లి, HZBలలో ఎక్కువగా ఉంది.

News April 18, 2026

గూగుల్, మెటాకు భారతీరెడ్డి లీగల్ నోటీసులు

image

గూగుల్, మెటా, X, యూట్యూబ్‌కు వైఎస్ జగన్ సతీమణి భారతీ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. సోషల్ మీడియాలో తనపై చేసిన తప్పుడు పోస్టులు, పరువుకు నష్టం కలిగించే పోస్టులను తొలగించాలని నోటీసులు ఇచ్చారు. కావాలనే తనను టార్గెట్ చేస్తూ పోస్టులు చేశారని పేర్కొన్నారు. తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను తొలగించాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. థింక్ ఆంధ్ర, M9 న్యూస్ సంస్థలకూ నోటీసులు పంపారు.

News April 18, 2026

రోహిత్, కోహ్లీ రికార్డ్ బద్దలుకొట్టిన స్మృతి మంధాన

image

ఉమెన్స్ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన రికార్డ్ సృష్టించారు. T20Iల్లో(మెన్స్&ఉమెన్స్) అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచారు. స్మృతి 155 ఇన్నింగ్స్‌లో 4,244 రన్స్ చేసి రోహిత్(4,231), కోహ్లీ(4,188)ని వెనక్కి నెట్టారు. రోహిత్ 154, కోహ్లీ 117 ఇన్నింగ్సుల్లో ఈ పరుగులు చేశారు. నిన్న SAతో జరిగిన తొలి T20లో స్మృతి 13 రన్స్ కొట్టి ఈ ఫీట్ సాధించారు. అయితే ఈ మ్యాచులో IND 6 వికెట్ల తేడాతో ఓడింది.