News February 26, 2026
కామారెడ్డి: స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

హకీంపేట్ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి NZB జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రంగా వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. 20 సీట్లు (10 బాలురు, 10 బాలికలు) అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు https://tgss.telangana.gov.in/ ద్వారా FEB 26 నుంచి MAR 4 వరకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News April 12, 2026
GNT: కటకటాల్లోకి సహాయ కమిషనర్.. ఉద్యోగం నుంచి సస్పెండ్

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ACB అధికారులు సహాయ కమిషనర్ శాంతిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 7న నిర్వహించిన తనిఖీల్లో రూ. 1.37 కోట్ల అక్రమాస్తులను గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. కోర్టు 21వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆమెను విజయవాడ జైలుకు తరలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 48 గంటలకు పైగా కస్టడీలో ఉన్నందున, ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. ములుగుకు 4వ ర్యాంక్

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ములుగు(D)లో రెగ్యులర్ విద్యార్థులు 1605 మంది పరీక్షలు రాయగా 1318 మంది పాసై 82.34 శాతంతో స్టేట్‌లోనే 4వ ర్యాంక్ వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 223 మందికి 186 మంది పాసై 83.41 శాతంతో 5వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 33 మందికి 17 మంది పాసై 51.52%తో 2వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో ఆరుగురికి ఇద్దరు పాసై 66.67%తో 2వ ర్యాంక్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ 1st ఇయర్.. HYDలో ఇదీ పరిస్థితి..!

HYDలో జిల్లాను ఇంటర్‌లో 3భాగాలుగా విభజించారు. HYD-1లో రెగ్యులర్ 1st ఇయర్ విద్యార్థులు 29660 మందికి 19933 మంది పాసవ్వగా 67.20%తో 8వ ర్యాంక్ కొట్టింది. HYD-2లో 36997మందికి 23001 పాసవ్వగా 62.17%తో 17వ స్థానంలో, HYD-3లో 11773 మందికి 7698 మంది పాసవ్వడంతో 65.39%తో 10వ స్థానంలో నిలిచింది.
☛ VOCలో HYD-1: 1357మందిలో 899 మంది పాసై 66.25%
☛ HYD-2 2043కి 1279 మంది 62.60%
☛ HYD-3 677కి 436 మంది పాసై 64.40%


