News August 13, 2024
కామారెడ్డి: స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి: కలెక్టర్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం ఆయన జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సిట్టింగ్ ఏర్పాట్లు పూర్తిచేయాలని నిర్దేశించారు.
Similar News
News October 17, 2025
NZB: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

నిజమాబాద్‌లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో పెట్రోల్ నిర్వహిస్తుండగా పెంబోలి రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తి పోలీసులు చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి నుంచి 110 గ్రాముల గంజాయి స్వాదినపరుచుకుని రిమాండ్‌కు తరలించమన్నారు.
News October 17, 2025
NZB: ఫ్యాక్టరీలో గుట్కా తయారీ, ఇద్దరి అరెస్ట్

NZB శివారులో అక్రమంగా తయారు చేస్తున్న గుట్కాను CCS పోలీసులు పట్టుకున్నారు. జన్నెపల్లి రోడ్డులో ఓ ఫ్యాక్టరీలో సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో గురువారం సోదాలు చేసి అక్కడ గుట్కా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గుట్కా తయారీకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అసాన్, అమీర్ అనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఫ్యాక్టరీలో పాన్ మసాలా ముసుగులో గుట్కా తయారు చేస్తున్నారు.
News October 17, 2025
NZB: 102 వైన్స్‌లకు దరఖాస్తులు ఎన్నంటే?

NZB జిల్లాలోని 102 వైన్ షాప్‌లకు సంబంధించి గురువారం వరకు 687 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. NZB ఫరిధిలోని మొత్తం 36 వైన్ షాపుల్లో 11 షాప్‌లకు 234 దరఖాస్తులు, BDN- మొత్తం18 వైన్ షాప్‌లకు 168, ARMR- 25 షాప్‌లకు 135, భీంగల్-12 వైన్ షాపులకు 65, మోర్తాడ్ పరిధిలో 11 వైన్ షాపులకు 85 దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు.