News January 29, 2025
కామారెడ్డి: ‘హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి’

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్, లైసెన్స్ లేకుండా ఎవరూ వాహనాలు నడిపిన కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒకరూ రోడ్డు నిబంధనలు పాటించాలని వివరించారు.
Similar News
News November 29, 2025
MHBD: సర్పంచ్గా మొదలై.. 6 సార్లు MLA

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలంలోని ఉగ్గంపల్లికి చెందిన మాజీ మంత్రి DS రెడ్యానాయక్ రాజకీయ దురందరుడు. ఆయన రాజకీయ జీవితం మొదటగా 1981లో సొంత గ్రామం ఉగ్గంపల్లి సర్పంచ్గా మొదలైంది. కాంగ్రెస్ నుంచి ఏకంగా 6 సార్లు MLAగా, మంత్రిగా, 2018లో పార్టీ మారి BRS ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
News November 29, 2025
సంగారెడ్డి: ఓపెన్ 10th, ఇంటర్ దరఖాస్తు గడువు పెంపు

ఓపెన్ 10th, ఇంటర్ అడ్మిషన్ గడువు అపరాధ రుసుముతో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి శుక్రవారం తెలిపారు. రెగ్యులర్ ఫీజుతో పాటు పదో తరగతికి అపరాధ రుసుము రూ.100, ఇంటర్మీడియట్కు రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇది అవకాశాన్ని అభ్యాసకులు వినియోగించుకోవాలన్నారు. అడ్మిషన్లకు ఇదే చివరి అవకాశమన్నారు.