News January 29, 2025

కామారెడ్డి: ‘హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి’

image

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్, లైసెన్స్ లేకుండా ఎవరూ వాహనాలు నడిపిన కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒకరూ రోడ్డు నిబంధనలు పాటించాలని వివరించారు.

Similar News

News February 14, 2025

వాంకిడి: పశువుల అక్రమ రవాణా.. ఇద్దరికి రిమాండ్

image

వాంకిడి మండలం టోల్‌ప్లాజా, ఖమానా ఎక్స్ రోడ్డు వద్ద అక్రమంగా పశువులను రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు పరారీలో ఉండగా వారిని వాంకిడి పోలీసులు పట్టుకొని కోర్టులో హాజరుపర్చారు. అందులో ఇద్దరికి ఆసిఫాబాద్ మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఎవరైనా పశువులను అక్రమ రవాణా చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

News February 14, 2025

సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 6మందికి జరిమానా

image

సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, రాజీవ్ రహదారిపై సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్నిరోజుల క్రితం వాహనాల తనిఖీ నిర్వహించారు. 6మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేశారు. మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా న్యాయమూర్తి కాంతారావు ముందు గురువారం హాజరుపరచగా 6 మందికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు.

News February 14, 2025

బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

image

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!