News March 21, 2025
కామారెడ్డి: 10 పరీక్షలు తొలి రోజు గైర్హాజరు ఎంతంటే..?

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ఉదయం 9:30 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 12,579 మంది విద్యార్థులకు 12,552 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు ఫ్లయింగ్ స్కాడ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
Similar News
News October 17, 2025
ధాన్యం సరఫరా వాహనాలను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం, ధాన్యం సరఫరా వాహనాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన, వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
News October 17, 2025
HYD: రూ.కోటి విలువైన హ్యాష్ ఆయిల్ సీజ్

HYDలో హాష్ ఆయిల్ దందాలో మైనర్లు పట్టుబడ్డారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా హాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు. సుమారు రూ.కోటి విలువ చేసే 6.5కిలోల హాష్ ఆయిల్‌ని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో దీనికి సంబంధించిన వివరాలు రాచకొండ సీపీ సుధీర్ బాబు నెరేడ్మెట్ నుంచి వెల్లడించనున్నారు.
News October 17, 2025
మంగళగిరి: ‘మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం’

మంగళగిరిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, ప్యానలిస్టుల కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా తిరుపతి నుంచి సంజీవని స్వరం పేరుతో కార్యక్రమం చేపడతామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మాణానికి చేపట్టిన పీపీపీ విధానంపై వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.