News March 21, 2025
కామారెడ్డి: 10 పరీక్షలు తొలి రోజు గైర్హాజరు ఎంతంటే..?

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ఉదయం 9:30 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 12,579 మంది విద్యార్థులకు 12,552 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు ఫ్లయింగ్ స్కాడ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
Similar News
News April 25, 2025
BREAKING: కాల్పులు ప్రారంభించిన పాకిస్థాన్!

నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాకిస్థాన్ కాల్పులు ప్రారంభించింది. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని, వారికి సైన్యం సమర్థంగా బదులిస్తోందని భారత సైనిక వర్గాలు తెలిపాయి. భారత్, పాక్ సీజ్ ఫైర్‌ను ఎత్తేశాయన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అదే జరిగితే సరిహద్దు వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.
News April 25, 2025
ఉద్రిక్తతల వేళ.. భారీ యుద్ధ విన్యాసం

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ సెక్టార్‌లో ‘ఆపరేషన్ ఆక్రమణ్’ పేరుతో భారీ స్థాయి వైమానిక దళ విన్యాసం చేపట్టింది. భారత్‌కు చెందిన అగ్రశేణి ఫైటర్ జెట్స్‌తో పాటు రఫేల్ యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. భూఉపరితలంతో పాటు కొండ ప్రాంతాలలో దాడి చేసేలా డ్రిల్ నిర్వహించారు. దీర్ఘ, స్వల్ప శ్రేణి శత్రు స్థావరాలను నిర్వీర్యం చేసేలా పైలట్లు విన్యాసం చేపట్టారు.
News April 25, 2025
పోలీసులకు సవాల్‌గా మారిన వీరయ్య హత్య కేసు?

మంగళవారం రాత్రి ఒంగోలులో జరిగిన వీరయ్య హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు ఐదుగురు అనుమానితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్య జరిగిన ప్రదేశానికి స్థానిక పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్లు ఉంది. హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి ఎస్పీ వెళ్లడానికి అరగంట పట్టింది. ఈ సమయంలో చుట్టుపక్కల చెక్‌పోస్టులను అలర్ట్ చేసి ఉంటే దుండగులు దొరికే వారని పలువురు ఆరోపిస్తున్నారు.