News February 13, 2026

కామారెడ్డి: 14, 32 వార్డులో గెలుపొందిన పిన్న వయస్కుకులు

image

కామారెడ్డి మున్సిపాలిటీలో ఫలితాలు ఒక్కొక్కటి వెలవడుతున్నాయి. 32 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గ్యార అఖిల విజయం సాధించగా, 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామ్ శెట్టి హర్షిత గెలుపొందారు. దీంతో కామారెడ్డి మున్సిపాలిటీలో అతిపిన్న వయసున్న ఇద్దరు మహిళలు గెలుపొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువత సైతం రాజకీయాల్లో రాణించగల నమ్మకం ఏర్పడినట్లు అయింది.

Similar News

News March 12, 2026

ప.గో: వేసవి హెచ్చరిక..

image

రానున్న వేసవి దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ గీతాబాయి సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో బయటకు వెళ్లరాదని కోరారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని, తరచుగా మంచి నీరు, కొబ్బరిబొండాలు సేవించాలని హితవు పలికారు. ఎండలో ప్రయాణించేటప్పుడు టోపీలు ధరించాలని ఆమె పేర్కొన్నారు.

News March 12, 2026

లారీ డ్రైవర్‌కు గుండెపోటు.. ఉచితంగా రూ.50 వేల విలువైన ఇంజెక్షన్‌

image

రావులపాలెం వచ్చిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లారీ డ్రైవర్ అశోక్ జైస్వాల్ బుధవారం గుండెపోటుకు గురయ్యారు. స్థానికులు వెంటనే అతన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో స్పందించి, ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న రూ.50 వేల విలువైన ఇంజెక్షన్‌ను ఇచ్చి అతని ప్రాణాలను కాపాడారు. సమయానికి స్పందించి ప్రాణం కాపాడిన వైద్య బృందాన్ని స్థానికులు అభినందించారు.

News March 12, 2026

గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కడప ఎస్పీ

image

వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ నకిలీ ప్రకటనలు ఇచ్చి వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ లింకులు పంపించి మోసం చేస్తున్నారని తెలిపారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా అధికారిక గ్యాస్ ఏజెన్సీల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని సూచించారు.