News January 22, 2025
కామారెడ్డి: 145 గ్రామ/ 23 వార్డు సభలు జరిగాయి

అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ CM బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న ప్రజాపాలన గ్రామ సభలపై మంగళవారం రాత్రి బట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో 145 గ్రామ/ 23 వార్డు సభలు జరిగాయన్నారు.
Similar News
News September 13, 2025
IBలో 394 జాబ్స్.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రేపే చివరి తేదీ. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై, 18-27 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. SC, STలకు ఎగ్జామ్ ఫీజు లేదు. జనరల్, ఓబీసీలు రూ.500 చెల్లించాలి. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది.<
News September 13, 2025
నిజాంసాగర్: 2 గేట్లు ఎత్తి 13,564 క్యూసెక్కులు విడుదల

ఉమ్మడి జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి శనివారం సాయంత్రం 2 గేట్లు ఎత్తి 13,564 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులోకి 11,887 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.383 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు చెప్పారు. కాగా ప్రాజెక్టు ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
News September 13, 2025
రేపే INDvsPAK.. మ్యాచ్ చూస్తారా?

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉంటే క్రేజే వేరు. కొందరైతే ఎంత ఖర్చయినా సరే విదేశాలకు వెళ్లి మ్యాచ్‌లు చూస్తుంటారు. కానీ పహల్గామ్ అటాక్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాయాదుల పోరుపై చాలామంది ఇంట్రెస్టే చూపట్లేదు. కొందరేమో మ్యాచ్‌ను మ్యాచ్‌లా చూడాలంటున్నారు. SMలో ఇంత రచ్చ అవుతున్నా BCCI & ప్లేయర్లు స్పందించలేదు. ఇంతకీ రేపు జరిగే మ్యాచ్‌ను మీరు వీక్షిస్తారా? బహిష్కరిస్తారా? కామెంట్ చేయండి.