News January 22, 2025

కామారెడ్డి: 145 గ్రామ/ 23 వార్డు సభలు జరిగాయి

image

అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ CM బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న ప్రజాపాలన గ్రామ సభలపై మంగళవారం రాత్రి బట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో 145 గ్రామ/ 23 వార్డు సభలు జరిగాయన్నారు.

Similar News

News July 7, 2025

షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తు చేసుకోండి: ములుగు కలెక్టర్

image

జాతీయ మానవ హక్కుల సంఘం(NHRC) ఆధ్వర్యంలో నిర్వహించే షార్ట్ ఫిలిం పోటీలకు అన్ని వర్గాల ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. మానవ హక్కులపై అవగాహన కల్పించే విధంగా 3 నుంచి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలను nhrcshrotfilm@gmail.comకు పంపించాలన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రూ.2 లక్షల నుంచి రూ.లక్ష వరకు అందిస్తారన్నారు.

News July 7, 2025

నస్పూర్: జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం

image

హైదరాబాద్‌లో 5 రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి జూనియర్ వుషూ పోటీల్లో నస్పూర్‌కు చెందిన అత్కపురం హాసిని ప్రతిభ కనబరిచి టైలు విభాగంలో బంగారు పథకం సాధించింది. తెలంగాణ SAI ఛైర్మన్ శివసేన రెడ్డి, వైస్ ఛైర్మన్ సోని బాలదేవి చేతులమీదుగా బంగారు పథకాన్ని హాసిని అందుకుంది. క్రీడాకారిణి హాసిని, కోచ్ శివమహేశ్‌ను జిల్లా వుషూ సంఘం ప్రెసిడెంట్ వేముల సతీశ్, జనరల్ సెక్రటరీ రాజనర్సు అభినందించారు.

News July 7, 2025

దండేపల్లి: అత్తారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

image

అత్తారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి మండలం గుడిరేవులో జరిగింది. ఎస్ఐ తహిసోద్దీన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రూపను భర్త, అత్తమామలు, సమీప బంధువులు వేధింపులకు గురి చేయడంతో ఆమె ఈ నెల 5న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రూప తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.