News April 16, 2025
కామారెడ్డి: 18 వరకు రేషన్ బియ్యం పంపిణీ

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18 వరకు రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు తెలిపారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఉచిత సన్న బియ్యం పంపిణీ చేయాలని రేషన్ డీలర్లను ఆయన ఆదేశించారు. ఇప్పటి వరకు సన్న బియ్యం తీసుకొని లబ్ధిదారులను ఈ నెల 18 వరకు రేషన్ షాపులకు వెళ్లి తీసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News April 21, 2025
అనకాపల్లి: సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్

ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్లు అనకాపల్లి కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన చేపట్టారు. 19 ఏళ్లుగా కూలీలకు, రైతులకు, గ్రామానికి సేవలు చేస్తున్నామని ఐనప్పటికీ తగిన గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
News April 21, 2025
ప్రొడ్యూసర్ నన్ను అసభ్యంగా పిలిచాడు: విద్యాబాలన్

బాలీవుడ్ నటి విద్యాబాలన్ గతంలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఓ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నా దగ్గరకు వచ్చి అసభ్యంగా పిలిచాడు. ఆ అవమానం తర్వాత 6 నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. ఈ మాటలు నాపై నాకున్న నమ్మకాన్ని నాశనం చేశాయి. సినిమా కోసం బరువు పెరిగితే బాడీ షేమింగ్ చేసేవారు. నా కెరీర్‌లో ఇలాంటివి చాలానే ఉన్నాయి’ అని తెలిపారు.
News April 21, 2025
నెల్లూరు కలెక్టరేట్‌లో ఉచిత భోజనం

నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) సోమవారం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. వీరికి కలెక్టర్ ఓ.ఆనంద్ ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు. తీవ్రమైన ఎండలతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.