News April 22, 2025
కామారెడ్డి: 27న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

ఈ నెల 27న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అచ్చంపేట్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కార్తీక సంధ్య తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ 6వ తరగతి పరీక్ష ఉదయం 10 నుంచి 12 వరకు, 7, 8, 9, 10 తరగతుల పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంటుందని చెప్పారు. హాల్ టికెట్లను telanagana.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 22, 2025
కడప: నాగాలాండ్‌కు బదిలీ అయిన యువజన అధికారి

ఉమ్మడి కడప జిల్లా నెహ్రూ యువ కేంద్ర యువజన అధికారిగా విధులు నిర్వహిస్తున్న మణికంఠ కడప నుంచి నాగాలాండ్ రాష్ట్రానికి బదిలీ అయ్యారు. జిల్లాలో ఐదు సంవత్సరాల పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. బదిలీపై వెళుతున్న మణికంఠను స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, వాలంటీర్లు ఘనంగా సన్మానించారు.
News April 22, 2025
తప్పడం తప్పు కాదు.. తొందరపడొద్దు..!

ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. పాసైనవాళ్లు సంబరాలు చేసుకుంటే.. ఫెయిలయ్యామని, మార్కులు తక్కువొచ్చాయని కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు భావించకండి. ఇప్పుడు తప్పితే.. సప్లీ అనే సెకండ్ ఆప్షన్ ఉంది. కానీ, తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. మీరే ప్రాణంగా బతికే మీ వాళ్ల జీవితకాలపు కన్నీళ్లకు కారకులవుతారు. తప్పడం తప్పు కాదని గ్రహించి.. సప్లీలో పాసై కాలర్ ఎగరేయండి. All The Best
News April 22, 2025
పెద్దపల్లిలో మందకొడిగా పత్తి విక్రయాలు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఇటీవల వర్షాలు, ధర పెరుగుతుందన్న కారణంగా రైతులు మార్కెట్‌కు పత్తిని తక్కువగా తీసుకొస్తున్నారు. పత్తి విక్రయాలు స్వల్పంగా ధర పెరిగింది. ప్రస్తుతం పత్తి నాణ్యతను బట్టి క్వింటాల్‌కి రూ.6,800 నుంచి రూ.7,200 వరకు ధర పలుకుతోంది.