News April 8, 2025
కామారెడ్డి: 2958 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: కలెక్టర్

కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. రబీ సీజన్లో 446 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, 278 కేంద్రాలు త్వరగా ప్రారంభించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, కేంద్రాల్లో టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 271 మంది రైతుల నుంచి 2958 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు.
Similar News
News November 2, 2025
PDPL: NOV 4న పెద్దపల్లిలో వాయుసేన అవగాహన సదస్సు

భారత వాయుసేనలో చేరేందుకు అవగాహన సదస్సు నవంబర్ 4న స్వరూప్ గార్డెన్స్లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ యువతకు చేరుకునే విధానం, అవకాశాలు, పరీక్ష విధానం, సిలబస్, పూర్తి సెలక్షన్ ప్రాసెస్ వివరిస్తారు. ఉ. 9 నుంచి మ. 12 వరకు జరుగుతుందని, 16-21 ఏళ్ల యువకులు, యువత, అభ్యర్థులు పాల్గొనాలని కలెక్టర్ సూచించారు. వివరాలకు 9949725997, 8333044460 సంప్రదించవచ్చును.
News November 2, 2025
నిజామాబాద్: వరుస హత్యలు.. మహిళలే టార్గెట్

నవీపేట్ మండల పరిధిలో మహిళల వరుస హత్యలకు గురవుతున్నారు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వారం క్రితం మద్దపల్లికి చెందిన శ్యామల లక్ష్మి బాసర రహదారి పక్కన అతి కిరాతకంగా హత్యకు గురైంది. ఈ ఘటన మరవక ముందే మరో గుర్తు తెలియని మహిళ మిట్టపూర్ శివారులో తల లేకుండా మొండెంతో గుర్తు పట్టలేని స్థితిలో హత్య చేశారు.
News November 2, 2025
మచిలీపట్నంలో కమాండ్ కంట్రోల్ కేంద్రం.. ప్రత్యేకతలేమిటంటే?

అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(RTGS) కేంద్రానికి అనుసంధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఈ కేంద్రంలో అధికారుల మీటింగ్ హాల్, జిల్లా స్థాయిలో RTGS సేవలు, CCTV డేటా, ఏపీ ఫైబర్నెట్ సేవా కేంద్రాలు ఇక్కడ నిర్మించనున్నారు. ఈ ఏడాదిలోపు ఈ కేంద్రాన్ని నిర్మించి RTGS సేవలు మరింత సమర్ధవంతంగా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.


