News March 13, 2025

కామారెడ్డి: 316 మంది గైర్హాజరు

image

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గురువారం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గణితం 1బి, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్‌కు సంబంధించి 7130 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 6915 మంది పరీక్ష రాశారు. ఒకేషనల్ విభాగంలో 1293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 101 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.

Similar News

News March 6, 2026

HYD: ఫైల్ కదలాలంటే సమర్పించుకోవాల్సిందే..!

image

సికింద్రాబాద్ GHMC ఆఫీసులో అకౌంట్స్ ఎగ్జామినర్ సంతోష్ ఓ పెన్షనర్ దగ్గర రూ.35వేలు లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. కాగా ఇది చిన్న శాంపిల్ మాత్రమే. ఇంజినీరింగ్ విభాగంలో 30శాతం కమీషన్ల దందా నడుస్తోందనే ఆరోపణలున్నా కేవలం చిన్న క్లర్కులను పట్టుకొని హడావిడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వందల కోట్ల ఆస్తులు వెనకేసిన పెద్ద ఆఫీసర్ల ఫైళ్లు మాత్రం బీరువాల్లోనే మగ్గుతున్నాయి.

News March 6, 2026

SPMVV: రేపు శశికళ సిన్హాకు డాక్టరేట్ ప్రదానం

image

SPMVVలో శనివారం 22వ కాన్వకేషన్ (స్నాతకోత్సవం) జరుగునుంది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (BMD) అభివృద్ధికి ముఖ్య సేవలు అందించిన మహిళా శాస్త్రవేత్త శశికళ సిన్హా హాజరు కానున్నట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు ఆమెకు శనివారం గౌరవ డాక్టరేట్ అందజేయనున్నట్లు తెలియజేశారు.

News March 6, 2026

ముంబై న్యూ జెర్సీలో హిట్‌మ్యాన్

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ IPL-2026కు ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ న్యూ జెర్సీలో ఫొటోలకు పోజులిచ్చారు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్.. ఐపీఎల్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంతో పోలిస్తే ఫుల్ ఫిట్‌నెస్ సాధించిన హిట్‌మ్యాన్.. ప్రత్యర్థులపై ఎలా చెలరేగుతారో చూడాలి. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందని క్రీడావర్గాలు వెల్లడించాయి.