News April 16, 2024

కామారెడ్డి: ‘350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు’

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ తెలిపారు. వాటి ద్వారా 22,894 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.13 కోట్లు రైతులకు అందజేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గన్ని బ్యాగుల కొరత లేదన్నారు. ప్రతి కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News February 1, 2025

నవీపేట్: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

image

నవీపేట్ మండలం ఎంచ గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వినయ్ కుమార్ వివరాల ప్రకారం.. రావుల పెద్దయ్యకు ఇద్దరు భార్యలు ఉన్నారు. నవీపేట్ సుభాష్ నగర్‌కి చెందిన రెండో భార్య సవిత ప్రతిరోజూ గొడవ పడుతుండేది. ఆమె బంధువులు వచ్చి బెదిరించడంతో గొడవ ఏర్పడింది. దీంతో పెద్దయ్య ఆవేశంలో శుక్రవారం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తమ్ముడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 1, 2025

NZB: ఫేక్ యాప్‌తో మోసం.. ఇద్దరి అరెస్ట్

image

ఫేక్ యాప్‌లో ఆఫర్ల పేరిట అమాయకులను మోసం చేస్తున్న షేక్ అమిర్, సయ్యద్ ఇమ్రాన్ అలీ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వివరాలు వెల్లడించారు. MGI యాప్ పేరుతో దాదాపుగా 12 మంది బాధితుల నుంచి రూ.2.40లక్షల నగదును కాజేశారని పేర్కొన్నారు. ఇలాంటి యాప్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసు ఛేదనకు కృషి చేసిన పోలీసు అధికారులను ACP అభినందించారు.

News February 1, 2025

ధర్పల్లి: ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి

image

దుబ్బాక గ్రామానికి చెందిన బొల్లారం సాయిలు అనే వ్యక్తి యూరియా కోసం ట్రాక్టర్ పై ధర్పల్లికి వెళ్తూ గ్రామ శివారులోని పసుపు పరిశోధన కేంద్రం సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో సాయిలు(52) అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ధర్పల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.