News January 26, 2025

కామారెడ్డి: 615 ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించాం: కలెక్టర్

image

4 పథకాల ప్రారంభోత్సవంపై సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో 535 గ్రామ, 80 వార్డు ప్రజాపాలన సభలు నిర్వహించినట్లు తెలిపారు. నాలుగు పథకాలకు సంబంధించి 1,03,938 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేయడం జరిగిందని వివరించారు..

Similar News

News July 11, 2025

శాఖాంబరీగా.. భద్రాకాళి దర్శనం

image

వరంగల్ ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శాకంబరీగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్చకులు అమ్మవారిని ఉదయాన్నే ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

News July 11, 2025

కరీంనగర్: ముఖ్య గమనిక.. రేపు స్క్రినింగ్ టెస్ట్

image

TG BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ స్క్రీనింగ్ ఈ నెల 12న నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం12 గం. నుంచి 2గం. వరకు వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరుగుతుందని సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. పరీక్షకు ఉమ్మడి KNR, MNCL జిల్లాల అభ్యర్థులు హాల్ టికెట్లను http://tgbcstudycircles.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.

News July 11, 2025

కరీంనగర్: ట్రాన్స్ జెండర్లకు శుభవార్త

image

ట్రాన్స్‌జెండర్ల ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్‌లో ప్రత్యేక పథకం చేపట్టిందని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక స్వావలంబనకై వారికీ డ్రైవింగ్, బ్యూటీషియన్ వంటి నైపుణ్య శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూలై 23, 2025లోగా www.wdsc.telangana.goవ్.inలో దరఖాస్తు చేయాలని, వివరాలకు 040-24559050ను సంప్రదించాలని వివరించారు.