News February 16, 2025

కామారెడ్డి: 72 మందికి నియామక పత్రాలు

image

కామారెడ్డి జిల్లాకు చెందిన 72 మందికి డీఎస్సీ 2008 అభ్యర్థులకు శనివారం నియామక ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో 70 మందికి నియామకపు ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అందించారు. సోమవారం నుంచి వారికి కేటాయించిన పాఠశాలల్లో విద్యాబోధన చేస్తారని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మండల విద్యాధికారి వెంకటేశం, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 12, 2026

NZB: గతేడాది ఇంటర్ ర్యాంకులు ఇవే..!

image

నేడు వెలువడనున్న ఇంటర్ ఫలితాల వేళ ఉమ్మడి జిల్లాలో ర్యాంకుల ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. గతేడాది ఫలితాలను విశ్లేషిస్తే.. రాష్ట్రస్థాయి ఉత్తీర్ణతలో కామారెడ్డి జిల్లా 4వ ర్యాంకుతో మెరవగా, నిజామాబాద్ జిల్లా 12వ స్థానంలో నిలిచింది. ఈసారి ఎలాగైనా టాప్-5లో నిలవాలని జిల్లా యంత్రాంగం, విద్యార్థులు పట్టుదలతో ఉన్నారు. ​గతేడాది మార్కుల్లోనూ విద్యార్థులు సత్తా చాటారు. ఈసారి బాగుంటుందని భావిస్తున్నారు.

News April 12, 2026

GNT: మరోసారి మెరిసిన వెన్నెల జ్యోతి సురేఖ

image

ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-1 మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారతజట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అమెరికాపై 233-232తో విజయం సాధించారు. మన తెలుగమ్మాయి వెన్నల జ్యోతి సురేఖ తన సహచర జట్టు క్రీడాకారిణులు మధుర, ప్రగతీలతో కలిసి భారత్ స్వర్ణపతకం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జ్యోతి సురేఖ ప్రపంచ వేదికలపై 12 సార్లు స్వర్ణపతకాలు సాధించి శభాష్ అనిపించుకున్నారు.

News April 12, 2026

భద్రాద్రి జిల్లాలో ఆగని రేషన్ బియ్యం దందా

image

జిల్లాలో సివిల్ సప్లైస్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్న రేషన్ బియ్యం అక్రమ దందా ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 3 నెలలు రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తూ ఉండటంతో అక్రమార్కులకు రేషన్ దందాకు అవకాశం దొరికింది. ఇటివలే ఇల్లందు, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, జూలూరుపాడు మండలాల్లో రేషన్ బియ్యం అధికారులు పట్టుకున్నారు. అధికారులు పట్టుకుంటున్న మరోవైపు బియ్యం అక్రమ రవాణా సాగుతూనే ఉంది.