News April 10, 2025
కామారెడ్డి: 76కు చేరుకున్న కల్తీ కల్లు బాధితులు

కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ బీర్కూర్ గాంధారి మండలాల్లో కల్తీ కల్లు బాధితుల సంఖ్య 76కు చేరుకుంది. బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని గత మూడు రోజులుగా 24 మందిని కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. బాన్సువాడ ఆసుపత్రికి బుధవారం ముగ్గురు బాధితులు రాగా, ఇద్దరిని డిశ్చార్జ్ చేశామని ఒకరు అడ్మిట్ అయ్యారని వైద్యులు తెలిపారు.
Similar News
News December 21, 2025
రేపు వరదలు, ప్రమాదాలపై మాక్ డ్రిల్

వరదలు, పరిశ్రమల ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుర్కోవాల్సిన తీరుపై అవగాహన కల్పించేందుకు సోమవారం ఖమ్మం నయాబజార్లోని ZPSS, జనరల్ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మాక్ డ్రిల్ జరగనున్నందున ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇందులో 50 మంది చొప్పున ఆపద మిత్ర వలంటీర్లు, 20 మంది NCC కేడెట్లు పాల్గొంటారని తెలిపారు.
News December 21, 2025
రామలక్ష్మణపల్లిలో 7.9°C ఉష్ణోగ్రత

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. రామలక్ష్మణపల్లి 7.9°C, గాంధారి 8.2, మేనూర్ 8.4, జుక్కల్ 8.8, డోంగ్లి 8.9, నాగిరెడ్డిపేట 9, పెద్ద కొడప్గల్ 9.2, లచ్చపేట, సర్వాపూర్, దోమకొండ 9.3, బిచ్కుంద, నస్రుల్లాబాద్ 9.5, ఎల్పుగొండ 9.6, బొమ్మన్ దేవిపల్లి 9.7, మాచాపూర్ 9.8, పుల్కల్ 9.9, బీర్కూర్ 10°Cల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News December 21, 2025
BR అంబేడ్కర్ వర్సిటీలో 71 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ఢిల్లీలోని డాక్టర్ <


