News February 24, 2025
కామారెడ్డి: CM రేవంత్ రెడ్డిని సన్మానించిన డీసీసీ అధ్యక్షుడు

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిమిత్తం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నిజామాబాద్ పట్టణానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు పూలబొకేను ఇచ్చి ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, జిల్లా నాయకులు ఉన్నారు.
Similar News
News November 16, 2025
19న అకౌంట్లలోకి రూ.7,000?

AP: PM కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల 19న రైతుల ఖాతాల్లో కేంద్రం రూ.2వేల చొప్పున జమ చేయనుంది. అదే రోజు రాష్ట్రంలో ‘అన్నదాత సుఖీభవ’ రెండో విడత నిధులను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ.5వేల చొప్పున అన్నదాతల అకౌంట్లలో జమ చేయనుందని సమాచారం. PM కిసాన్తోపాటు ‘సుఖీభవ’ స్కీమ్నూ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే AUGలో తొలి విడత నిధులను రిలీజ్ చేశారు.
News November 16, 2025
వంటింటి చిట్కాలు

* సమోసా పిండిలో కొద్దిగా బియ్యం పిండిని కలిపితే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి.
* బిర్యానీలోకి ఉల్లిపాయలను వేయించే సమయంలో అందులో చిటికెడు చక్కెర వేస్తే ఉల్లిపాయ కరకరలాడుతుంది. అలాగే వేయించడం కూడా త్వరగా పూర్తవుతుంది.
* కూరల్లో కారం, ఉప్పు ఎక్కువైతే స్పూన్ శనగపిండి కలపండి.
* ఓవెన్లో బ్రెడ్ని కాల్చే సమయంలో బ్రెడ్తో పాటు చిన్న గిన్నెలో నీరు ఉంచితే.. బ్రెడ్ మెత్తగా మంచి రంగులో ఉంటుంది.
News November 16, 2025
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అనుమల్లి పేటకు చెందిన బొడ్డు శ్రీనివాస్(45) మృతి చెందాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. మిర్యాలగూడ వైపు బైక్పై వెళ్తున్న అతన్ని వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ కిందపడగా, ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.


