News January 28, 2025

కామారెడ్డి: DLSA కార్యదర్శిని కలిసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారి

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారి ప్రమీల DLSA కార్యదర్శి, న్యాయమూర్తి నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై, న్యాయపరమైన అంశాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో DLSA, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 18, 2025

RR: 3 ఫేజుల్లో.. ముగ్గురు లక్కీ సర్పంచ్‌లు

image

రంగారెడ్డి జిల్లాలో 3విడతల్లో లక్కీగా సర్పంచ్‌ పీఠం ముగ్గురిని వరించింది. 1st ఫేజ్‌లో కొందర్గు చిన్నఎల్కిచర్లలో ఇద్దరికి సమాన ఓట్లురాగా టాస్‌తో రాజు గెలిచారు. 2nd ఫేజ్‌లో చేవెళ్ల గుండాలలో నరాలు తెగే ఉత్కంఠలో ఒక్క ఓటుతో బుచ్చిరెడ్డి గెలిచారు. 3rd ఫేజ్‌లో యాచారం తులేఖుర్దులో ఇద్దరికి సమాన ఓట్లు రాగా ఉద్రిక్తతకు దారితీస్తుందని గమనించిన పోలీసులు పరిస్థితి అదుపుచేయగా రికౌంటింగ్‌లో రమేశ్ గెలుపొందారు.

News December 18, 2025

గన్నవరంలో విమానాలు ల్యాండింగ్‌కి అంతరాయం

image

గన్నవరంలో గురువారం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ ప్రభావంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ల్యాండింగ్‌కు ఆటంకం ఏర్పడింది. బెంగళూరు నుంచి గన్నవరం చేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వే క్లియరెన్స్ లేక గాల్లో చక్కర్లు కొట్టింది. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణం మెరుగుపడిన తర్వాతే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

News December 18, 2025

బురుజుపేట: సాయంత్రం 4 గంటల నుంచి దర్శనాల నిలిపివేత

image

బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. మార్గశిర మాసం ఆఖరి గురువారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు. సహస్ర ఘట్టాభిషేకానికి దేవస్థానం ఏర్పాట్లు చేపట్టగా సాయంత్రం 4 గంటల నుంచి ఏడు గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం మహా అన్నదానం నిర్వహించనున్నారు.