News January 28, 2025

కామారెడ్డి: DLSA కార్యదర్శిని కలిసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారి

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారి ప్రమీల DLSA కార్యదర్శి, న్యాయమూర్తి నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై, న్యాయపరమైన అంశాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో DLSA, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News February 18, 2025

కోటప్పకొండపై కాకులు వాలవు

image

కోటప్పకొండ కొండపై కాకులు వాలవు. కొండ ఎక్కుతున్నప్పుడు అనేక కాకులు దారిలో కనిపించిన కొండపైన మాత్రం ఒక కాకి కూడా మనకు కనిపించదు. భక్తురాలు గొల్లభామ ఎప్పటి లాగానే స్వామివారికి నైవేద్యంగా పాలు, పెరుగును తీసుకొని కొండ మెట్ల పైగా వస్తుంది. ఈలోగా ఒక కాకి వాలి నైవేద్యమును నేలపాలు చేసింది. దీంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదని శపించిందని అప్పటి నుంచి కాకులు రావని భక్తుల నమ్మకం

News February 18, 2025

వనపర్తి: వివాహిత అదృశ్యం.. మిస్సింగ్ కేసు నమోదు

image

కొత్తకోట మండలంలోని వడ్డెవాట గ్రామానికి చెందిన చెన్నమ్మ ఈనెల 14వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఆనంద్ తెలిపారు. ప్రసాద్‌కు చెన్నమ్మతో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ప్రసాద్ హైదరబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 13న భార్య పిల్లలతో కలిసి వడ్డెవాటకు రాగా ఆమె కనిపించకుండాపోయిందని పేర్కొన్నారు.

News February 18, 2025

నెల్లూరు: సముద్రపు వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు

image

సముద్రపు వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతైన ఘటన TP గూడూరు(M)లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకన్నపాలెం పట్టపుపాలెం గ్రామానికి చెందిన కే.వెంకటేశ్వర్లు అనే మత్స్యకారుడు వేటకు వెళ్లి తీరానికి చేరుకోలేదు. తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకూరుపేట(M), కొరుటూరు సమీపంలో మృతదేహం కొట్టుకొచ్చింది. తోటపల్లి గూడూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

error: Content is protected !!