News March 7, 2025
కామారెడ్డి SP సింధు శర్మ బదిలీ

కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పోలీస్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సింధు శర్మను ఇంటెలిజెన్స్ ఎస్పీగా నియమించారు. ఆమె స్థానంలో కామారెడ్డి నూతన ఎస్పీగా రాజేష్ చంద్రాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి
Similar News
News March 15, 2025
20 ఏళ్ల తర్వాత మళ్లీ జహీర్ ఖాన్‌కు ‘ఐ లవ్ యూ’

ఎప్పుడో 20 ఏళ్ల క్రితం భారత పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌కు లవ్ ప్రపోజ్ చేసిన యువతి మరోసారి వార్తల్లోకెక్కారు. లక్నో జట్టు మెంటార్‌గా ఉన్న జహీర్‌కు ఓ హోటల్లో మరోసారి అదే రీతిలో ప్రపోజ్ చేశారు. ‘జహీర్ ఐ లవ్ యూ’ అని పోస్టర్ ప్రదర్శించారు. ఈ ఫొటోను LSG షేర్ చేసింది. కాగా 2005లో టీవీఎస్ కప్ సిరీస్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ఈ యువతి లవ్ ప్రపోజ్ చేసి వైరల్ అయ్యారు.
News March 15, 2025
తూగో జిల్లా ఇన్ఛార్జ్ డీఎస్వోగా భాస్కర్ రెడ్డి

తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ పౌర సరఫరాల శాఖ అధికారి(డీఎస్వో)గా కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రిలోని కలెక్టరేట్ ఆవరణలో ఉన్న పౌర సరఫరాల శాఖ అధికారి కార్యాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. కే ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌తో పాటు జిల్లా హౌసింగ్ పీడీగా భాస్కర్ రెడ్డి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
News March 15, 2025
SKLM: ఈ నెల 16 నుండి 17 వరకు ఎపిపిఎస్సీ పరీక్షలు

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు పగడ్బందిగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాకుళం కలెక్టరేట్లో ఈ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఫారెస్టు రేంజ్ అధికారి పరీక్షకు 546, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్లకు 152 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్షలు ఈ నెల 16 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.