News April 1, 2025
కామారెడ్డి: WOW.. రాయిని చీల్చి.. వృక్షంగా ఎదిగి!

ప్రకృతి అంతులేని శక్తికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన దృశ్యం నిజాంసాగర్ శివార్లో కనిపించింది. నిశ్చలంగా కనిపించే ఒక పెద్ద బండరాయిని చీల్చుకుంటూ ఓ మొక్క మొలకెత్తి, నేడు ఎదిగి వృక్షంగా మారింది. ఏది ఏమైనప్పటికీ, ఈ రాయిని చీల్చుకుని ఎదిగిన వృక్షం మనందరికీ ఒక గొప్ప సందేశాన్నిస్తోంది. అడ్డంకులు ఎంత పెద్దగా ఉన్నా, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చనే స్పూర్తినిస్తోంది.
Similar News
News April 8, 2025
HYD: హైకోర్టును ఆశ్రయించిన మన్నె క్రిశాంక్

HCU భూములపై AI వీడియోల విషయంలో తనపై నమోదైన కేసుల పట్ల బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఘటనపై 4 FIRలు నమోదు చేశారని, రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టారంటూ ఆయన తరఫు న్యాయవాది వాదించారు. దీంతో పిటిషన్‌పై తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేస్తూ.. పోలీసుల విచారణకు సహకరించాలని క్రిశాంక్‌ను హైకోర్టు ఆదేశించింది.
News April 8, 2025
ఖమ్మం జిల్లాలో ఉదయం ఎండ, సాయంత్రం వాన

ఖమ్మం జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాయంత్రం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి ఈదురుగాలలో కూడిన వర్షం కురుస్తోంది. సోమవారం జిల్లాలో వడగండ్ల వర్షం కురవడంతో మామిడి కాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట నేలకొరిగింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తమయ్యారు.
News April 8, 2025
బహిరంగ సభకు అనుమతివ్వకుంటే కోర్టుకు వెళ్తాం: కేటీఆర్

TG: 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండో తెలుగు పార్టీ BRS అని కేటీఆర్ అన్నారు. అందుకే వరంగల్‌లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ సారి డిజిటల్ మెంబర్షిప్ ప్రవేశపెడుతున్నామని, అందుకోసం జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా జిల్లాల్లో నెలకో కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.