News July 28, 2024
కారంచేడు: గేదెను ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. తిమిడిదపాడు స్వర్ణ గ్రామాల మధ్యలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వంకాయలపాడు గ్రామానికి చెందిన ఈదర శ్రీనివాసరెడ్డి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా గేదె రోడ్డుపై అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం బలంగా దూడను ఢీకొంది. ఈ ప్రమాదంలో గేదె, ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News December 21, 2025
ప్రకాశం: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?
News December 21, 2025
ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుడి సస్పెండ్.!

పాఠశాల రికార్డుల్లో విద్యార్థుల సంఖ్య తారుమారు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. సంతనూతలపాడు మండలం మంగమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు విధుల్లో ఉండగా.. ఇటీవల RJD పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో విద్యార్థుల సంఖ్య రికార్డుల్లో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కాగా RJD వివరణతో అతణ్ని సస్పెండ్ చేసినట్లు DEO తెలిపారు.
News December 21, 2025
కనిగిరిలో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం

కనిగిరి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శనివారం రైల్వే శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. రైల్వే స్టేషన్, రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. వెనుకబడిన కనిగిరి ప్రాంతానికి రైల్వే శాఖ సేవలు అందుబాటులోకి రావటం వలన ఈ ప్రాంత ప్రజలకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. పనులు వేగవంతమైనట్లు అధికారులు తెలిపారు.


