News January 27, 2025
కారంపూడి: టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

ఉరివేసుకొని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కారంపూడి మండలంలోని లక్ష్మీపురంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గార్లపాటి అమర్ (16) కారంపూడిలోని ఓప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వాసు ఘటనా ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 9, 2025
రోజుకు 2-3 గంటలే నిద్రపోతా: సల్మాన్ ఖాన్

తాను రోజుకు 2-3 గంటలే నిద్రపోతానని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తెలిపారు. నెలలో 2-3 సార్లు మాత్రమే 7-8 గంటలు నిద్రపోతానని తన తమ్ముడి కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ‘షూటింగ్ గ్యాప్‌లో కూడా చిన్న కునుకు తీస్తా. విమానం కుదుపులకు గురైనా హాయిగా నిద్రపోతా. జైలులో ఉన్నప్పుడు మాత్రం నిద్రకు ఎక్కువ సమయం కేటాయించా’ అని చెప్పుకొచ్చారు. కాగా సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమాలో నటిస్తున్నారు.
News February 9, 2025
జనగామ: వసతి గృహాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ రైల్వే ట్రాక్ పరిధిలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, రాత్రి అక్కడే బస చేయనున్నారు.
News February 9, 2025
SA20 టోర్నీ విజేతగా MI కేప్‌టౌన్

SA20-2025 టైటిల్‌ను MI కేప్‌టౌన్ గెలుచుకుంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఫైనల్‌లో 76 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత MI 181-8 స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్ 105 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీ చరిత్రలో MIకి ఇదే తొలి టైటిల్. కాగా తొలి రెండు సీజన్లలో సన్ రైజర్స్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.