News February 2, 2025
కారంపూడి: రోడ్డు ప్రమాదంలో మిర్చి వ్యాపారి మృతి

రోడ్డు ప్రమాదంలో మిర్చి వ్యాపారి ఆళ్ల అనిల్ కుమార్ (24)మృతిచెందిన ఘటన కారంపూడి మండలం ఒప్పిచర్ల పెట్రోల్ బంక్ వద్ద శనివారం జరిగింది. మృతుడు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పరిధిలోని కండ్రిక గ్రామం గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తూ పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల రైతులను కలిసి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. కారంపూడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 26, 2026
పాడి పశువులను అలా కట్టేసే ఉంచుతున్నారా?

చాలా మంది పాడి రైతులు పశువులను రోజంతా అలా కట్టేసి ఉంచుతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు వెటర్నరీ నిపుణులు. దీని వల్ల వాటికి గాయాలు కావడంతో పాటు మానసిక ఒత్తిడికి గురవడంతో పాటు క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుందని అంటున్నారు. వాటిని కచ్చితంగా ఉదయం, సాయంత్రం కాసేపు నడిపించాలని సలహా ఇస్తున్నారు. వాటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పశువులకు రోజూ స్నానం చేయించాలని సూచిస్తున్నారు.
News February 26, 2026
రాష్ట్రంలో 250 పోస్టులు.. అప్లై చేశారా?

ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్‌లో 250 అప్రెంటిస్ పోస్టులకు NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. TG ట్రాన్స్‌కోలో రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. BE/BTech(EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, IT), డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు స్టైపెండ్ రూ.17,500, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.15,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://tgtransco.com
News February 26, 2026
తూ.గో: కలుషిత పాలు.. ప్రాణాలను కాపాడే ‘ఇంజెక్షన్’ వస్తోంది!

కలుషిత పాలు తాగి అస్వస్థతకు గురైన వారి కోసం ముంబై నుంచి ప్రత్యేకంగా ‘ఫోమెబెస్ట్’ యాంటీడోట్ తెప్పిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం వెల్లడించారు. నెఫ్రాలజిస్ట్ డా.రవి రాజు సూచనల మేరకు రోగులకు ఈ ఇంజెక్షన్లు ఇస్తామన్నారు. ఈ మందు మన రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో అంతర్జాతీయ ఏజెన్సీల ద్వారా సేకరిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.


