News June 5, 2024

కారుకు బ్రేక్… ప్రభావం చూపలేకపోయిన నామా

image

ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు చుక్కెదురైంది. ఏ రౌండ్లోనూ ఆయన ప్రభావం చూపలేకపోయారు. మొత్తం 12,40,582 ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి 2,99,082 ఓట్లు మాత్రమే సాధించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు 5,67,459 ఓట్లు పోల్ కాగా, పోలింగ్ శాతం 49.80గా నమోదైంది. ఈసారి కేవలం 24.10 శాతం ఓట్లే సాధించి ఓటమి చవిచూశారు. 

Similar News

News November 12, 2025

‘ఖమ్మం కలెక్టర్ సారూ.. ఇల్లు మంజూరు చేయరూ’

image

ఖమ్మం నగర శివారు అల్లీపురంలో నివసిస్తున్న దివ్యాంగ దంపతులు అంతోని అంజమ్మ, గోపాల్ ఇటీవలి గ్రీవెన్స్ డేలో తమ గోడును కలెక్టర్‌కు విన్నవించారు. ఆరోగ్యం సహకరించక, ఇల్లు కట్టుకునే స్థోమత లేక డబుల్ బెడ్‌రూమ్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని వారు వాపోయారు. కలెక్టర్, ఇతర అధికారులైనా స్పందించి తమకు ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.

News November 11, 2025

ఖమ్మం: వీధి కుక్కలకు వింత వ్యాధులు

image

జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాయి. అన్ని మండలాల్లో కుక్కల చర్మంపై భయంకరమైన మచ్చలు ఏర్పడి దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు వెంటనే స్పందించి, కుక్కలకు సోకిన ఈ వ్యాధిని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

News November 11, 2025

ఖమ్మం కలెక్టర్‌ను కలిసిన నూతన DEO

image

ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖ అధికారి(డీఈఓ)గా నియమితులైన చైతన్య జైని, బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా రంగ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.