News October 24, 2024

కారుచౌకగా భూములు కేటాయింపు: మంత్రి

image

పెందుర్తి కేంద్రంగా గల విశాఖ శ్రీ శారదా పీఠానికి గత ప్రభుత్వం కారుచౌకగా భూములను కేటాయించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎకరం రూ.20 కోట్ల ధర పలికే భూమిని కేవలం రూ. లక్ష రూపాయలకే కేటాయించినట్లు పేర్కొన్నారు. అందుకనే భూముల కేటాయింపును రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 24, 2025

విశాఖలో 16వ శతాబ్ధం నాటి ఆనవాళ్లు!

image

విశాఖ మధురవాడ 7వ వార్డు పరిధి సుద్దగెడ్డ సమీపంలో టిడ్కో గృహాల వద్ద రహదారి విస్తరణ పనుల్లో బయటపడ్డ శ్రీరాముడి విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ఫాల్గుణ రావు ఆధ్వర్యంలో బృందం స్థలాన్ని పరిశీలించి, ఈ విగ్రహం పురాతన రాతితో తయారైనదిగా, శైలి ఆధారంగా 16వ శతాబ్దానికి చెందినదిగా నిర్ధారించారు. మిగతా భాగం రాముని విగ్రహాలు కూడా ఇక్కడే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

News December 24, 2025

విశాఖ: 13 ఏళ్ల క్రితం మహిళ మిస్సింగ్.. కేసును చేధించిన పోలీసులు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో పాత కేసులను రీ-ఓపెన్ చేసిన పోలీసులు ఓ మిస్సింగ్ కేసును చేధించారు. 2012లో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చుక్క కుమారి అదృశ్యమయ్యారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ చేసి సాంకేతిక ఆధారాలతో ఆమెను తెలంగాణలో గుర్తించారు. 13 ఏళ్ల తర్వాత ఆమెను క్షేమంగా తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ టీ.కామేశ్వరరావు తెలిపారు.

News December 24, 2025

విశాఖ: రైలు ప్రయాణికులకు అలర్ట్..

image

వాల్తేరు డివిజన్ కేకే లైన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేశారు. విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/02), రూర్కెలా-జగదల్‌పూర్ (18107/08), హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447/48) రైళ్లు డిసెంబర్ 24న కోరాపుట్ వద్దే నిలిపివేయబడతాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లు జగదల్‌పూర్/కిరండూల్‌కు బదులుగా కోరాపుట్ నుంచే ప్రారంభమవుతాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు.