News February 2, 2025

కారుణ్య నియామక పత్రం అందజేసిన ఎస్పీ

image

బత్తలపల్లిలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతిచెందిన హోంగార్డ్ ఆంజనేయులు కుమారుడు ప్రసన్న కుమార్‌కు కారుణ్య నియామకం పత్రాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న అందజేశారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ప్రసన్నకుమార్‌కు నియామక పత్రం అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. నిబద్ధతతో విధులు నిర్వహించుకోవాలని ఆయనకు సూచించారు.

Similar News

News October 18, 2025

ఏలూరు జిల్లాలో భారీగా గంజాయి తరలింపు

image

ఏలూరు జిల్లాలో 59 కేసులలో సీజ్ చేసిన 3403.753 కేజీల గంజాయిని గుంటూరు జిల్లాలోని జిందాల్ సంస్థ నిర్వహించే డిస్పోజల్ చేసేందుకు తరలిస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శనివారం తెలిపారు. పర్యావరణానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా వీటిని డిస్పోజల్ చేస్తున్నట్లు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

News October 18, 2025

రూల్స్ ప్రకారమే వైన్స్ టెండర్లు: డిప్యూటీ కమిషనర్

image

రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే వైన్స్ టెండర్లు వేస్తామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నల్గొండలో వైన్స్ టెండర్ల ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 154 వైన్ షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, నేడే తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో టెండర్లు వస్తాయని ఆయన చెప్పారు.

News October 18, 2025

ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

image

AP: ఏజెన్సీల్లోని గురుకుల విద్యార్థులను విషజ్వరాలు వణికిస్తున్నాయి. కురుపాం స్కూళ్లో 150 మందికి పైగా జాండీస్ సోకగా ఇద్దరు మరణించడం తెలిసిందే. తాజాగా సాలూరు ఇతర ప్రాంతాల్లో 2900 మందికి వైద్య పరీక్షలు చేయగా 21మంది జ్వరాలున్నట్లు తేలింది. జాండీస్, మలేరియా ఉన్న వారికి చికిత్స అందిస్తున్నారు. స్కూళ్లలో పారిశుధ్య లోపం, ఏళ్లతరబడి మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయకపోవడమే వీటికి కారణమని పేర్కొంటున్నారు.