News February 2, 2025
కారుణ్య నియామక పత్రం అందజేసిన ఎస్పీ

బత్తలపల్లిలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతిచెందిన హోంగార్డ్ ఆంజనేయులు కుమారుడు ప్రసన్న కుమార్‌కు కారుణ్య నియామకం పత్రాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న అందజేశారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ప్రసన్నకుమార్‌కు నియామక పత్రం అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. నిబద్ధతతో విధులు నిర్వహించుకోవాలని ఆయనకు సూచించారు.
Similar News
News February 8, 2025
ఆధిక్యంలోకి వచ్చిన కేజ్రీవాల్, సిసోడియా

న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత కేజ్రీవాల్(254+), జంగ్‌పురాలో మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా(1800+) తొలిసారి ఆధిక్యంలోకి వచ్చారు. కౌంటింగ్ మొదలైన దాదాపు రెండు గంటల తర్వాత ఆప్ అగ్రనేతలు లీడింగ్‌లోకి వచ్చారు. మరోవైపు కల్కాజీ స్థానంలో సీఎం ఆతిశీ, షాకూర్ బస్తీలో సత్యేంద్ర జైన్ వెనుకంజలో కొనసాగుతున్నారు.
News February 8, 2025
అమెరికా అమ్మాయితో ఎన్టీఆర్ జిల్లా అబ్బాయి పెళ్లి

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొణిజర్లకు చెందిన నంబూరు వరుణ్‌కు అమెరికా అమ్మాయితో వివాహమైంది. వరుణ్ USAలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో షర్లెట్‌కు చెందిన ఎరికాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త పెళ్లిగా మారింది. ఇద్దరు కుటుంబాల సమక్షంలో శుక్రవారం రాత్రి కొణిజర్లలో వారికి వివాహమైంది. నూతన వధూవరులను కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు.
News February 8, 2025
17 మంది అభ్యర్థులు-23 సెట్ల నామినేషన్లు

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి నామినేషన్లు ఊబందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 17 మంది అభ్యర్థులు 23 సెట్లు నామినేషన్లు వేశారు. ఈరోజు, రేపు సెలవు ఉండడంతో నామినేషన్‌కు 10న ఒక్క రోజే గడువు ఉంది.