News June 27, 2024
కార్డులు లేక 10 ఏళ్లుగా ప’రేషన్’

ఖమ్మం: కొత్తరేషన్ కార్డుల కోసం పేదకుటుంబాలు కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురుచూస్తున్నారు. ప్రజాపాలనసభల్లో అత్యధికంగా కార్డుల కోసమే దరఖాస్తులు అందజేశారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి రేషన్
కార్డులు ఇవ్వలేదు. అంతకుముందు జారీచేసిన కార్డుల ఆధారంగానే ఆన్లైన్లో
వివరాలు నమోదు చేశారు. 2021లో జిల్లాలో 12,216 మందికి కొత్త రేషన్ కార్డులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్లీఊసేలేదు.
Similar News
News November 23, 2025
రేపు ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు (సోమవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కల్లూరు మండలం దారుక బంజారాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.
News November 23, 2025
ఖమ్మం: సామాన్య కార్యకర్త నుంచి జిల్లా సారథిగా..

ఖమ్మంకాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వైరా నేత నూతి సత్యనారాయణ గౌడ్ రాజకీయ ప్రస్థానం దశాబ్దాల నాటిది. గతంలో ఆయన NSUI, యూత్ కాంగ్రెస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా జిల్లాలో పార్టీని పటిష్ఠం చేయడంలో, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాన్ని ఏకం చేయడంలో ఆయన నియామకం కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
News November 23, 2025
KMM: డీసీసీ అధ్యక్షుల్లో మంత్రుల అనుచరులకు కీలక స్థానం

ఖమ్మం డీసీసీ అధ్యక్షుల నియామకంలో ముగ్గురు మంత్రుల అనుచరులకు పదవులు దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం భట్టి వర్గానికి చెందిన నూతి సత్యనారాయణ, ఖమ్మం టౌన్ అధ్యక్షుడిగా తుమ్మల వర్గం నుంచి నాగండ్ల దీపక్ చౌదరి, కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా మంత్రి పొంగులేటి వర్గానికి చెందిన తోటదేవి ప్రసన్న ఖరారయ్యారు. ఈ నియామకాలతో సామాజిక న్యాయం కూడా జరిగిందనే చర్చ జరుగుతోంది.


