News April 16, 2025
కార్పొరేట్ తరహా వైద్య సేవలు: MLA వీరేశం

పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన ధ్యేయమని MLA వీరేశం అన్నారు. నకిరేకల్లో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని పనులను పరిశీలించారు. 95% నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 5 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్పొరేట్ వైద్యం తరహాలో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని, ఆసుపత్రిని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు.
Similar News
News November 24, 2025
అపరిచితులకు మీ వివరాలు ఇవ్వొద్దు: పోలీసులు

కేవలం 5 నిమిషాల్లో లోన్ వస్తుందనే మాటల్ని నమ్మి, అపరిచితులకు మీ వివరాలు ఇవ్వద్దని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్బీఐ అనుమతి లేని యాప్స్ను ఇన్స్టాల్ చేయొద్దని, వాటి నుంచి లోన్ తీసుకోవద్దని, ఎవరికి ఆన్లైన్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపించొద్దని పోలీసులు ప్రజలకు సూచనలు చేశారు.
News November 24, 2025
నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ ధర్మేంద్ర ఆరోగ్యం విషమించింది. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఈక్రమంలోనే అంబులెన్స్ ఆయన ఇంటికి చేరుకుంది. అటు బంధువులు, బాలీవుడ్ ప్రముఖులు ధర్మేంద్ర ఇంటికి వెళ్తున్నారు.
News November 24, 2025
నిరంజన్ నీ తాటతీస్తా.. ఒళ్లు జాగ్రత్త: కవిత

TG: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై జాగృతి చీఫ్ కవిత ఫైరయ్యారు. ఆయన అవినీతి వల్లే వనపర్తిలో BRSకు కోలుకోలేని దెబ్బపడిందని దుయ్యబట్టారు. 3, 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నారని విమర్శించారు. MRO ఆఫీసును తగలబెడితే ఎదురుతిరిగిన 32 మందిని జైలుకు పంపారన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఓడించడం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. ‘నాగురించి ఇంకోసారి మాట్లాడితే నీ తాటతీస్తా. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో’ అని హెచ్చరించారు.


