News February 1, 2025

కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర బడ్జెట్: బీవీ రాఘవులు

image

కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు ఏరకంగా కూడా ఉపయోగపడే విధంగా లేదని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. శనివారం నెల్లూరులో జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ జిమ్మిక్కులు చేస్తున్నదని మండిపడ్డారు.

Similar News

News February 8, 2025

నెల్లూరు: ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని సిద్ధంగా ఉన్నాయని RIO శ్రీనివాసులు తెలిపారు. శనివారం D.K బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎగ్జామినర్ల సమావేశంలో ప్రసంగిస్తూ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణ కోసం అన్ని సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

News February 8, 2025

నెల్లూరు: ఇంజెక్షన్ వేస్తున్నట్లు నటించి నగలు చోరీ.. అరెస్ట్

image

నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లోని ఓ వ్యక్తికి అనారోగ్యంగా ఉండడంతో ఇంజెక్షన్ వేసేందుకు కార్తీక్ అనే కాంపౌండర్ వచ్చాడు. ఇంజెక్షన్ వేస్తున్నట్లు నటిస్తూ సమీపంలో బంగారు ఆభరణాలు గమనించి చోరీకి పాల్పడ్డాడు. బంగారం దొంగిలించినట్లు గమనించిన ఉదయ శేఖర్ రెడ్డి దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులో తీసుకొని 95 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

News February 8, 2025

నేడు కావలిలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటన

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం కావలి పట్టణంలో పర్యటించనున్నారు. కలెక్టర్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కావలి సెల్ఫీ పాయింట్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటలకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వెంగళరావునగర్‌లో ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఇందిరమ్మ కాలనీలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. 

error: Content is protected !!