News January 13, 2026
కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యం: కలెక్టర్ తేజస్

జిల్లాలో మంజూరైన ‘యంగ్ ఇండియా’ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చిలుకూరు, గడ్డిపల్లి, తొండలలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
78ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్

ఇండోర్‌కు చెందిన సుష్మా మౌఘే మరాఠీ సాహిత్యంలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. గత నలభై ఏళ్లుగా సంగీత ఉపాధ్యాయురాలిగా చేసిన ఆమె కెమిస్ట్రీలో M.Sc కూడా చేశారు. అనేక పుస్తకాలు రచించడంతో పాటు హిందీ పుస్తకాలను మరాఠీలోకి అనువదించారు. 76ఏళ్ల వయసులో దేవి అహల్యా విశ్వవిద్యాలయంలో M.Aలో చేరి తాజాగా జరిగిన స్నాతకోత్సవంలో 78ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్ అందుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఎవరెవరు పుట్టారంటే?

ఫాల్గుణ మాసం అనేక పురాణ పురుషుల, మహాత్ముల జన్మలకు వేదిక. ఈ మాసంలోనే హరిహరసుతుడు అయ్యప్పస్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించారు. శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి వంటి మహనీయులు కూడా ఈ మాసంలోనే జన్మించారు. అర్జునుడు, ధర్మరాజు, భీముడు ఈ మాసంలోనే జన్మించారు. కొందరు కౌరవ వీరులు కూడా ఫాల్గుణ మాసంలోనే జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
News February 18, 2026
HYD: రేపటి నుంచి నైట్ అంతా ఓపెన్!

తెలంగాణలో రంజాన్ సందర్భంగా షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్‌లకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు మినహాయింపులు అమలులో ఉంటాయి. ప్రతి రోజూ ఉదయం 5 గంటల వరకు(నైట్ బజార్) షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇక చార్మినార్‌లో రేపటి నుంచి నైట్ బజార్ మొదలుకానుంది. ఇక 24/7 నగరవాసుల రాకపోకలతో పాతబస్తీ కళకళలాడనుంది.


