News December 21, 2024

కార్పొరేషన్‌గా మహబూబ్‌నగర్

image

మహబూబ్‌నగర్ పట్టణం ఇక అప్‌గ్రేడ్ కానుంది. పట్టణాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేస్తన్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం పట్టణంలో 49 వార్డుల్లో 2.88 లక్షల జనాభా ఉంది. కొత్తగా కార్పొరేషన్ ఏర్పడేందుకు 3 లక్షల జనాభా అవసరం కానుండటంతో శివారులోని జైనల్లీపూర్, దివిటిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. ఇదిలా ఉండగా మద్దూరు, దేవరకద్ర పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారనున్నాయి.

Similar News

News January 24, 2025

పాలమూరు నుంచి డిండికి నీటి మళ్లింపు

image

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి డిండికి నీటి మళ్లింపు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదం తెలపడం, తాజాగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంత జరుగుతున్నా జిల్లా MLAలు, ప్రజాప్రతినిధుల మౌనం జిల్లా వాసులను కలవర పెడుతోంది. దీనిపై ఆందోళనలు ఉద్ధృతం చేసేందుకు పాలమూరు అధ్యయన వేదిక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

News January 24, 2025

MBNR: ప్రభుత్వ ఉద్యోగుల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రద్దు !

image

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందిన ఉద్యోగులపై కలెక్టర్ విజయేందిర కొరడా ఝుళిపించారు. వారికి కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అనర్హులకు డబుల్ ఇళ్ల కేటాయించారన్న ఫిర్యాదులపై విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, రిటైర్డ్, పెన్షనర్లు ఇళ్లు పొందినట్లు తేలింది. దీంతో నిబంధనలు అతిక్రమించిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాని చెప్పారు.

News January 24, 2025

పాలమూరు ఎత్తిపోతలకు పీఆర్ఎల్ఐ పథకంగా నామకరణం

image

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పీఆర్ఎల్ఐ పథకంగా పేరు పెడుతూ.. నీటిపారుదల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.