News January 27, 2025
కార్పొరేషన్‌గా మారిన మంచిర్యాల

మంచిర్యాల మున్సిపాలిటీ పాలకవర్గం పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. జిల్లాలోనే పాత మున్సిపాలిటీగా ఉన్న మంచిర్యాలను కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల గెజిట్ విడుదల చేసింది. దీంతో నస్పూర్ మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని వేంపల్లి, కొత్తపల్లి, పోచంపాడ్, ముల్కల్ల, గుడిపేట, చందనాపూర్, నర్సింగాపూర్, నంనూర్ గ్రామాల విలీనంతో పాత కొత్త కలయికలతో మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
Similar News
News November 27, 2025
ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు: పాక్ రక్షణ మంత్రి

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలులో ఆరోగ్యంగా ఉన్నారని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. జైలులో 5స్టార్ హోటల్ కంటే మెరుగైన ఫుడ్ అందుతోందని, టీవీ చూసేందుకు, వ్యాయామానికి అనుమతిచ్చినట్టు చెప్పారు. నేడు, డిసెంబర్ 2న ఆయనను కలిసేందుకు కుటుంబసభ్యులకు జైలు అధికారులు అనుమతిచ్చారు. ఇమ్రాన్‌ను మరో జైలుకు తరలించారనే వార్తలను తోసిపుచ్చారు. రావల్పిండి జైలు దగ్గర ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళన విరమించారు.
News November 27, 2025
రాజవొమ్మంగి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి

రాజవొమ్మంగి గ్రామానికి చెందిన అబ్దుల్ ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. గ్రామంలో కిరాణా షాపు నిర్వాహకుడు దావుద్ కుమారుడు అయిన అబ్దుల్ ఆదివారం ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా రాజవొమ్మంగి శివారులో టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అబ్దుల్ కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News November 27, 2025
KNR: పంచాయతీ పోరు.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జీపీ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు జరుపుతున్నాయి. అర్థబలం, ప్రజల్లో పేరు ప్రతిష్టలు ఉన్న నాయకులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ పల్లెల్లో పట్టు నిలుపుకోవడానికి పంచాయతీ పాలకవర్గం కీలకం. KNRలో 316, JGTLలో 385, SRCLలో 260, PDPLలో 263 జీపీలు ఉన్నాయి.


