News September 24, 2024

కార్పొరేషన్ ఛైర్మన్‌గా శ్రీకాకుళం నేత.. నేపథ్యం ఇదే

image

ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వజ్జ బాబురావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, నాయకులు అభినందనలు తెలిపారు. గతంలో ఈయన పలాస మున్సిపాలిటీ ఛైర్మన్‌గా చేశారు. టీడీపీలో ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఈ పదవి వరించినందుకు సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

Similar News

News October 30, 2025

ఇచ్ఛాపురంలో పర్యటించిన జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్

image

‘మెంథా’ తుపాను ప్రభావంతో జిల్లాలో నష్టం వాటిల్లిన నేపథ్యంలో, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం ఇచ్ఛాపురం మండలంలో పర్యటించారు. తుపాన్ కారణంగా జిల్లాలో అత్యధికంగా ఈ మండలంలో 1,118 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు. బిల్లంగి, జగన్నాథపురం గ్రామాల్లో నీటి ముంపులో ఉన్న వరి చేలును ఆయన పరిశీలించారు. 53 క్యూసెక్కులు నీరు బహుదానదిలో ప్రవహిస్తుందన్నారు. నష్టం అంచనా వేయాలన్నారు.

News October 30, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

★పొందూరులో 50 గ్రామాలకు రాకపోకలు బంద్
★సోంపేట ప్రభుత్వ పాఠశాలలో కూలిన చెట్టు
★పంటపొలాలు, వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు కూన, బగ్గు, బెందాళం
★నందిగం: కోతకు గురైన R&B రోడ్డు.. తక్షణ చర్యలు
★పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన పాతపట్నం ఎమ్మెల్యే
★కాశీబుగ్గలో పలు మెడికల్ షాపుల్లో దొంగతనాలు
★పలాస: వరహాల గెడ్డలో వ్యక్తి గల్లంతు
★ నారాయణపురం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాగావళి

News October 29, 2025

శ్రీకాకుళం: పొలాల్లో వాన నీరు..రైతు కంట కన్నీరు

image

‘మొంథా’ తుపాన్ ప్రభావానికి భారీ వర్షాలు, ఈదురు గాలులకు శ్రీకాకుళం జిల్లాలోని 2,230.29 హెక్టారాల్లో పంట నష్టం సంభవించింది. ఈ విపత్తుతో 4,801 మంది రైతులు నష్టపోయారు. వరి 2,227.5 హెక్టార్లు, ఉద్యాన పంటలు 2.79 హెక్టార్లు దెబ్బతిన్నాయి. అత్యధికంగా ఇచ్ఛాపురం 1,118 హెక్టార్లలో వరికి నష్టం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారు. పొలాల్లో నీటిని మళ్లించి, సాగును కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు.